Top 10 viral news 🔥

వారి శ్రమ ఫలితమే ఈ విజయం: సీఎం రేవంత్
TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని ఆయన అన్నారు.




