
VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక కారు రామగంగ కాలువలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అదుపు తప్పి నేరుగా కాలువలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిపోయింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక మరణించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.




