Nov 04, 2025, 05:11 IST/జుక్కల్
జుక్కల్
నిజాంసాగర్ అప్డేట్: ప్రాజెక్టులో 11, 929క్యూసెక్కుల వరద
Nov 04, 2025, 05:11 IST
కామారెడ్డి-నిజామాబాద్ జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ ఖరీఫ్ లో 70 రోజులు దాటినా వరద కొనసాగుతోంది. మంగళవారం 11,929 క్యూసెక్కుల వరద రాగా, 2 గేట్లు ఎత్తి 8,096 క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1404.99 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు ఏఈ సాకేత్ ఈ వివరాలు తెలిపారు.