Oct 21, 2025, 07:10 IST/
యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్.. చెట్టును ఢీకొని కారు బోల్తా (వీడియో)
Oct 21, 2025, 07:10 IST
యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారిని ప్రమాదపు అంచుల వరకు తీసుకెళ్లింది. కర్ణాటకలో కొంతమంది స్నేహితులు కారులో ప్రయాణిస్తూ వాహనాన్ని అతివేగంగా నడిపారు. కారులో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ వీడియో రికార్డు చేశారు. అతివేగం కారణంగా కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. అక్టోబరు 16న కలబురగిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటనలో యువకులకు గాయాలైనట్టు తెలుస్తోంది.