சர்க்கார் பெரியபாளையம் - Sircar Periapalayam Census Town

కామారెడ్డి జిల్లా
దివ్యాంగ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి
Oct 30, 2025, 17:10 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

దివ్యాంగ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి

Oct 30, 2025, 17:10 IST
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులలో తల్లిదండ్రులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని, ఎల్లారెడ్డి ఎంఈఓ ఎల్. రాజులు సూచించారు. గురువారం స్థానిక భవిత భవనంలో తెలంగాణ సర్వ శిక్షాభియాన్ వారి సహిత విద్యలో భాగంగా, ప్రభుత్వం ద్వారా శారీరక దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు. దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్ చే వారానికి రెండు సార్లు సోమవారం, గురువారం, నెలకు మొత్తం 8 శిబిరాలు ఉంటాయని తెలిపారు.