ஜோலார்பேட்டை - Jolarpet

வீடியோஸ்


నిర్మల్ జిల్లా
Jun 26, 2026, 14:06 IST/

మొహర్రం ఊరేగింపులో విషాదం.. తజియా హైటెన్షన్ వైర్లకు తగిలి ముగ్గురు మృతి

Jun 26, 2026, 14:06 IST
మధ్యప్రదేశ్‌లోని రాట్లం జిల్లా హత్నారా గ్రామంలో శుక్రవారం సాయంత్రం మొహర్రం ఊరేగింపు సందర్భంగా విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎత్తుగా ఉన్న తజియా హైటెన్షన్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను రషీద్ ఖాన్, సద్దు హుస్సేన్, అర్బాజ్ ఖాన్‌గా గుర్తించారు. గాయపడిన వారికి రాట్లం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.