భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట మంగళవారం సాయంతం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తూ లారీ కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. లారీని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కింద బైక్ పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.