
మహబూబ్ నగర్: ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు ప్రత్యేక రైలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే కర్నూలు నుంచి సికింద్రాబాద్ వరకు ఒక ప్రత్యేక రైలును నడపనున్నట్లు మహబూబ్ నగర్ రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ముక్తార్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 2:50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి 9:30కి కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:30కు కర్నూలు చేరుకుంటుంది.





































