
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చడంపై హర్షం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇటీవల తీర్మానం చేయడంతో, గురువారం స్థానిక వైద్య సిబ్బందితో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.





































