భారత్-బంగ్లా రెండో టెస్టు.. టాస్ ఆలస్యం

కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్ ను సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. ఇక రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
