
కొత్తగూడెం: డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి
గురువారం కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) చట్టాల అమలుపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ నిర్వహణ అనుమతులు, నిబంధనలపై సమీక్షించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు.





















