
పరిగి మున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ పోటీ, యువతకు భరోసా
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన గౌతమ్, పరిగి మున్సిపల్ 9వ వార్డ్ నస్కల్ నుండి పోటీ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసి, ప్రస్తుతం లా విద్యను అభ్యసిస్తున్న గౌతమ్, 2018 నుండి 2024 వరకు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. యువతను ముందుండి నడిపిస్తున్న గౌతమ్‌కు గ్రామస్తులు, నియోజకవర్గ యువకులు అభినందనలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికీ సేవ చేస్తూ ముందుకు వెళ్తానని గౌతమ్ అన్నారు.



























