
ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు
పాదచారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫుట్‌పాత్‌పై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్‌పాత్‌లపై నడిచే వారికే ప్రాధాన్యత ఉంటుందని, పాదచారుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
















































