
దేశవ్యాప్తంగా 20 చోట్ల NIA సోదాలు
దేశవ్యాప్తంగా 20 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహించింది. ఐసిస్, అల్‌ఖైదా భావజాలాన్ని ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న కేసులో ఈ తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు 11 మంది నిందితులను, ఒక జువైనల్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు. ఈ దాడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ జరిగాయి.




