పూల కోసం చెరువులో దిగి ఇద్దరు మృతి

పూల కోసం చెరువులో దిగి ఇద్దరు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. పండుగ పూజకు అవసరమైన పూలు కోయడానికి కోరుకొండ కొత్త చెరువులోకి దిగిన వీరబాబు (35), శివ (35) అనే ఇద్దరు యువకులు ఊబిలో కూరుకుపోయి నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో పశ్చిమ గోనగూడెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే వయస్సు కలిగిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పండుగ సంతోషం తీరని శోకాన్ని మిగిల్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా