సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కేరళలోని పాలక్కాడ్‌లో 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించగా, ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ దీనిని తయారు చేశారు. ఎస్పీబీ స్మారక ఉద్యానవనాన్ని సింగర్ హరిహరన్, సింగర్ చిత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలు కుటుంబసభ్యులతో పాటు పలువురు మలయాళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.