AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో 10 మంది చనిపోయారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపై ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామని, కానీ నిర్వాహకులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఆలయంలో ఏం జరుగుతోందనేది వారు చూసుకోవాలని, స్థానిక అధికారులకు సమాచారమిస్తే భద్రత కల్పిస్తామని చెప్పారు.