AP: కూటమి ప్రభుత్వం టీటీడీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఉద్యోగులకు 10 శాతం జీతాల పెంపుతో కూడిన జీవోను విడుదల చేసింది. శాశ్వత ఉద్యోగుల జీతం రూ. 1540 పెంచి రూ.15,400కు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.754 పెంచి రూ.7,535కు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంతో టీటీడీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.