AP: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితా (షార్ట్ మెమో) విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. వీటిని https://bse.ap.gov.in వెబ్‌సైట్‌లోని పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కుల మెమోలు తమ లాగిన్ నుంచి డౌన్‌లోడ్ చేసి, సంతకం, పాఠశాల ముద్రతో విద్యార్థులకు అందజేయనుంది. ఏమైనా తప్పుల సవరణ చేయాల్సి ఉంటే పాఠశాల లాగిన్‌లో ‘ఎడిట్’ అవకాశం కల్పించామని, ఈ నెల 29 నుంచి జూన్ 4 వరకు ఎడిట్ చేసుకోవాలని సూచించింది.