ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 ప్రాజెక్టులు: మంత్రి నిమ్మల

44చూసినవారు
ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 ప్రాజెక్టులు: మంత్రి నిమ్మల
AP: రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్