నకిలీ బాంబు బెదిరింపులు: 1100 ఈమెయిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్

1191చూసినవారు
నకిలీ బాంబు బెదిరింపులు: 1100 ఈమెయిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలకు వేలాది బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో, 1100 నకిలీ ఈమెయిల్స్ పంపిన శ్రీనివాస్ లూయిస్ (47) అనే వ్యక్తిని కర్ణాటకలోని మైసూరులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితుడు మానసిక ఒత్తిడితో ఉన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్స్, ఇతర మార్గాల ద్వారా బెదిరింపులు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. సైబర్ పోలీసుల బృందం రెండు వారాల పాటు దర్యాప్తు చేసి, డిజిటల్ ఆధారాలతో నిందితుడిని గుర్తించి, మైసూరులోని బృందావనం లేఅవుట్‌లో పట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్