అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో 111 అడుగుల ఎత్తైన అన్నమయ్య మహావిగ్రహం నిర్మాణం జరుగుతోంది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో, 75 టన్నుల పంచలోహంతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహాన్ని ప.గో జిల్లాకు చెందిన శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ ఆధునిక 3D సాంకేతికతతో రూపొందిస్తున్నారు. విడి భాగాలుగా తయారు చేసి నౌక ద్వారా తరలించి, 160 టన్నుల ఉక్కు చట్రంపై అమర్చనున్నారు. 2028 మే 9న అన్నమయ్య జయంతి నాడు ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.