AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి గురువారం వరకు 115 మంది బాధితులుగా నమోదయ్యారు. వీరిలో 61 మంది ఆసుపత్రి, వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతుండగా, 54 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. తాగునీరు, ఆహార నమూనాలు ల్యాబ్‌కు పంపించారు. అధికారులు 15 దుకాణాలను తనిఖీ చేసి మూడుచోట్ల నమూనాలు సేకరించారు. ప్రభావిత 11 వార్డుల్లో ప్రత్యేక అధికారులను నియమించి, పారిశుద్ధ్యం, చిన్నారులు, వృద్ధులపై దృష్టి సారించారు.