తిరుమల మెట్లెక్కిన 116 ఏళ్ల బామ్మ.. స్పందించిన సీఎం (వీడియో)

4చూసినవారు
కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమలకు కాలినడకన మెట్లు ఎక్కి చేరిన వీడియోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "శభాష్ అవ్వా" అంటూ ఆమె సంకల్పాన్ని అభినందించారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని ఈ అవ్వ నిరూపించారని పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుల సహకారం ప్రశంసనీయమని, శ్రీవారిపై ఆమెకు ఉన్న అచంచల భక్తికి ఈ యాత్ర నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.