సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT)లో 117 ఖాళీలను భర్తీ చేయడానికి పోస్టల్ శాఖ (ఇండియా పోస్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ (16), టెక్నికల్ సూపర్‌వైజర్ (101) పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి డెప్యుటేషన్ ప్రాతిపదికన అవకాశం కల్పిస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 47,600 నుంచి రూ. 1,51,100 వరకు (అసిస్టెంట్ మేనేజర్), రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు (టెక్నికల్ సూపర్‌వైజర్) జీతం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 27 అభ్యర్థులు బెంగుళూరు, చెన్నై, మైసూర్ వంటి CEPT కేంద్రాలలో పనిచేయాల్సి ఉంటుంది.