తిరుమలలో మంగళవారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం నాడు శ్రీవారిని 81,692 మంది భక్తులు దర్శించుకోగా 35,361 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు సమకూరింది.