హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డిజైన్ ట్రైనీ/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఆగస్టు 14 లోపు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ hal-india.co.inను సందర్శించండి.