మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ని 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా, ఆమె గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించి, జువినల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్లక్ష్యం వహించిన హాస్టల్ సూపరింటెండెంట్, ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.