బీహార్ లో మాయమైన మొబైల్ టవర్, జనరేటర్

3949చూసినవారు
బీహార్ లో మాయమైన మొబైల్ టవర్, జనరేటర్
బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ ప్రాంతంలో నివాస ప్రాంతం మధ్యలో ఉన్న 132 అడుగుల భారీ మొబైల్ టవర్, అక్కడే ఉన్న ఓ పెద్ద జనరేటర్, ఇతర సాంకేతిక పరికరాలు అకస్మాత్తుగా మాయమైపోయాయి. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థల యజమాని 2010లో చేసుకున్న 12 ఏళ్ల ఒప్పందం 2022తో ముగిసిపోయిందని, తీరా చూస్తే ఇప్పుడు టవరే లేకుండా పోయిందన్నారు. టవర్ గత 15-20 రోజులుగా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. బక్సర్ ఎస్పీ శుభం ఆర్య ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో తేలిన వివరాల బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్