ప్రకాశం జిల్లాలో నల్లమలలో ఉన్న కాటమరాజు బావి 13వ శతాబ్దంలో తవ్వించారు. ఆ కాలంలో కనిగిరిని పాలించిన కాటమరాజు, నెల్లూరు రాజు నల్లసిద్ధితో జరిగిన యుద్ధంలో గోసంపదను కోల్పోయి నల్లమలలో నివశించినప్పుడు ఈ బావి తవ్వించారు. అప్పటినుంచి ఈ బావి ఎప్పుడూ ఎండిపోలేదు. పశ్చిమ ప్రకాశం ప్రజలు తమ పశుసంపద రక్షణ కోసం కాటమరాజుకు ప్రతి సంవత్సరం మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్లకు వేలాది భక్తులు వస్తారు. చిలుకల కారణంగా ప్రారంభమైన వివాదం కాటమరాజు–నల్లసిద్ధి యుద్ధానికి దారితీసిందని తెలుస్తోంది.