పాక్‍లోని అదియాలా జైలు నుంచి 14 మంది ఖైదీల పరారీ

6889చూసినవారు
పాక్‍లోని అదియాలా జైలు నుంచి 14 మంది ఖైదీల పరారీ
పాకిస్థాన్‌లోని అదియాలా సెంట్రల్ జైలు నుంచి 14 మంది ఖైదీలు పోలీసుల కళ్లలో కారం చల్లి తప్పించుకున్నారు. రావల్పిండి జిల్లా కోర్టు విచారణ అనంతరం జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రావల్పిండి, ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన 10 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్