AP: పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏపీ ప్రభుత్వం 8 నుంచి 14 అంతస్తుల భారీ టవర్లలో లగ్జరీ ఫ్లాట్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పట్టణాల మధ్యలోనే, అందుబాటులో ఉన్న స్థలంలో ఈ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారు. అంతస్తులు పెరిగే కొద్దీ ఫ్లాట్ ధర తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. G+8 ఫ్లోర్ల ఫ్లాట్ ధర సుమారు రూ. 17.51 లక్షలు ఉండగా, G+14 ఫ్లోర్ల ఫ్లాట్ ధర సుమారు రూ. 15.70 లక్షలుగా అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.