స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (SBI)లో 1,500 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పరీక్ష ఫీజు రూ.750 కాగా, SC, ST, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ జులై 8. ఆగస్టులో ప్రిలిమినరీ, సెప్టెంబర్‌లో మెయిన్స్
పరీక్షలు జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు https://sbi.bank.in/web/careers/probationary-officers ను సందర్శించవచ్చు.