ఒకేరోజు 16 మంది రిటైర్.. ఏపీ సచివాలయంలో అరుదైన ఘట్టం

80చూసినవారు
ఒకేరోజు 16 మంది రిటైర్.. ఏపీ సచివాలయంలో అరుదైన ఘట్టం
ఏపీ సచివాలయంలో మంగళవారం, జూన్ 30న ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వివిధ శాఖలకు చెందిన 16 మంది సీనియర్ అధికారులు, ఉద్యోగులు ఒకేరోజు పదవీ విరమణ పొందారు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా బదిలీలు, ప్రమోషన్లపై విధించిన ఫ్రీజింగ్ గడువును జూలై 5 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, గడువును పొడిగించడంతో, రిటైర్ అయిన 16 మంది అధికారుల స్థానాల్లో అర్హులైన సిబ్బందికి తక్షణమే ప్రమోషన్లు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్