AP: కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్లలో 183 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది. ఉదయం విజయవాడ ధర్నా చౌక్ నుంచి సచివాలయ ఉద్యోగులను పోలీసులు తీసుకొచ్చారు. రాత్రి 9 దాటినా సచివాలయ ఉద్యోగులు ఇంకా పోలీస్ స్టేషన్లలోనే ఉన్నట్లు సమాచారం. ఆధార్ కార్డులు ఇచ్చి సంతకాలు పెట్టాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగులు సైతం పోలీస్ స్టేషన్‌లో ఉండటంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.