ఉయ్యూరులో 19 డయేరియా కేసులు నమోదు

7976చూసినవారు
ఉయ్యూరులో 19 డయేరియా కేసులు నమోదు
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో రాష్ట్ర వైద్య బృందం పర్యటించింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇప్పటివరకు ఉయ్యూరులో 19 డయేరియా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తామన్నారు. ప్రభావిత వార్డుల్లో రెండు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్