కబడ్డీ ఆడుతూ 19 ఏళ్ల యువకుడు మృతి!

33932చూసినవారు
ఏపీలోని కర్నూలు జిల్లా అటికెలగుండులో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీ (19) అనే యువకుడు ఆడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులోనే యువకుడి మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్