అర్హులైన పేదలకు 2-3 సెంట్ల స్థలం: మంత్రి కొలుసు

27చూసినవారు
అర్హులైన పేదలకు 2-3 సెంట్ల స్థలం: మంత్రి కొలుసు
AP: పేదలకు మంత్రి కొలుసు పార్థసారథి శుభవార్త చెప్పారు. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారికి 2-3 సెంట్ల స్థలం ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పినా.. ఎవరికి అందాయో తెలియడం లేదన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైనా చర్చ జరిగిందని మంత్రి కొలుసు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్