2 గంటల పనికి 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారు: CBN (వీడియో)

22చూసినవారు
AP: వాలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వ హయాంలో 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారని వ్యాఖ్యానించారు. అది కేవలం రెండు గంటల పని అని పేర్కొన్నారు. ఇప్పుడు 1.65 లక్షల మంది ఉద్యోగులతో 3 గంటల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని గతంలో కూటమి మంత్రులు పేర్కొన్నారు.