AP: అర్హులందరికీ 2029 నాటికి పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 2.61 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మందిలో 7.5 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 2.5 లక్షల మందికి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు.