AP: విశాఖలోని సీతంపేటలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడిపోవడం వల్ల మొత్తం 20 మంది చిన్నారులకు గాయాలు అయ్యాయి. వీరిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసి, గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.