తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారని ఆయన అన్నారు. అధికారులకు అనుగుణంగా నివేదికలు తయారు చేయించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భక్తులలోనూ, అధికారులలోనూ కలకలం రేపాయి.