కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు: TTD ఛైర్మన్

56చూసినవారు
కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు: TTD ఛైర్మన్
AP: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'తిరుమలలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి మహాపాపం చేశారు. కాసుల కక్కుర్తి కోసం భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారు. గతంలో ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్