ఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించగా, 4,853 కేసులు నమోదయ్యాయని మంగళవారం లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు, తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ వివరాలను లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వడగాలులు, పిడుగుపాటులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చామని ఆయన పేర్కొన్నారు.