దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులలో 20% మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయనున్నారు. వీరికి శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు, గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా లభించనుంది. సాయుధ దళాలలో నాలుగేళ్ల సేవ తర్వాత అగ్నివీర్‌లను భద్రతా దళాలలోకి చేర్చుకోవాలన్న కేంద్రం ప్రణాళికలో భాగంగా, ఢిల్లీ పోలీస్ శాఖ నిబంధనలలో ఈ సవరణ చేశారు.