
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. వీడియో
ఆస్ట్రియాలోని వియన్నా నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన ఓ వ్యక్తి, రెండు ప్రాంతాల గాలి నాణ్యతను పోల్చి చూపే వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. వియన్నాలో వాయు కాలుష్యం లేకపోవడంతో నగరం స్పష్టంగా కనిపించగా, ఢిల్లీలో కాలుష్యం కారణంగా అంతా మసకగా, దుమ్ముతో నిండి కనిపించింది. ఈ వీడియో ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కట్టినట్టు చూపుతోంది. ఇటీవల ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 దాటిన నేపథ్యంలో ఈ వీడియో వైరల్గా మారింది.




