జగన్ ఇలాకాలో 200 మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరిక

50చూసినవారు
జగన్ ఇలాకాలో 200 మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరిక
AP: వైఎస్ జగన్‌కు సొంత నియోజకవర్గంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కడప జిల్లా వేంపల్లి మండల కేంద్రానికి చెందిన దాదాపు 200 మైనారిటీ కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. ఈ పరిణామం స్థానిక వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఆయన టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్