థాయ్‌లాండ్‌లో 2,100 ఏళ్ల నాటి బంగారు ఉంగరాలు గుర్తింపు

1303చూసినవారు
థాయ్‌లాండ్‌లోని పెట్‌చాబురి ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో సుమారు 2,100 ఏళ్ల నాటి రెండు బంగారు ఉంగరాలు లభ్యమయ్యాయి. ఒక మానవ అస్థిపంజరం పక్కన దొరికిన ఈ ఉంగరాలలో ఒకదానిపై పురాతన భారతీయ లిపి అయిన ‘బ్రాహ్మీ’ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. దీనిపై “పుసారఖితాస” అని రాసి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బ్రాహ్మీ లిపి ఆధారంగా ఈ ఉంగరాల యజమాని భారతదేశానికి చెందిన ‘వైశ్య’ వర్గానికి చెందిన వర్తకుడు అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్