చిన్న సినిమాలూ థియేటర్లు, ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న సినిమాలు భారీ విజయాలు అందుకుంటున్నాయి. ఇదే తరహాలో మలయాళ చిత్రం 'బాలన్: ది బాయ్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 19న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్, 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు రూ.1.82 కోట్ల నెట్ కలెక్షన్లతో ప్రారంభమైన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ వసూళ్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది.