AP: అమరావతి సమీపంలోని ఉండవల్లి ఘటనపై తాడేపల్లి పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు
వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నానిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని తోసిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు చేశారు. అలాగే
వైసీపీ నేత వాహనం అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో
టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.